Adipurush: మ‌ర్యాద‌గా దేశానికి సారీ చెప్పండి

Mumbai: ప్ర‌భాస్ (prabhas) న‌టించిన ఆదిపురుష్ (adipurush) సినిమా ఓ ప‌క్క బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్న‌ప్ప‌టికీ చాలా మంది ఆడియ‌న్స్‌కి సినిమా అస్స‌లు న‌చ్చ‌లేదు. రావ‌ణాసురుడి లుక్, హ‌నుమంతుడి డైలాగులు, చీప్ VFX వ‌ల్ల రామాయ‌ణానికి అవ‌మానం జ‌రిగింద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో శివ‌సేన‌ ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది (priyanka chaturvedi) ఆదిపురుష్ (adipurush) టీం దేశానికి సారీ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. హ‌నుమంతుడి క్యారెక్ట‌ర్‌పై చీప్ డైలాగులు రాసి హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసార‌ని అన్నారు. సినిమా డైరెక్ట‌ర్ ఓం రౌత్, డైలాగ్ రైట‌ర్ మ‌నోజ్ ముంతాషిర్‌లు దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందేన‌ని డిమాండ్ చేసారు.