Donald Trump: ఫుడ్ పెట్టిస్తానని చెప్పి బిల్లు కట్టని ట్రంప్!
America: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) చేసిన పని వల్ల పలువురు ప్రజలు ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు. ప్రసిడెంట్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత దేశ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలను తన ఇంటికి తీసుకెళ్లిపోయి బాత్రూమ్‌లో దాచుకున్నాడన్న ఆరోపణలపై ట్రంప్ మంగళవారం మియామీ కోర్టులో హాజరయ్యారు. ఆ తర్వాత లిటిల్ హవానా ప్రాంతంలో ఉన్న ఓ క్యూబన్ రెస్టారెంట్‌కు వెళ్లారు ట్రంప్. ఆయన్ను చూసి రెస్టారెంట్‌లో ఉన్నవారంతా సర్‌ప్రైజ్ అయ్యారు. ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా అందరికీ ఫుడ్ అని ట్రంప్ అనౌన్స్ చేసారు. దాంతో రెస్టారెంట్ సిబ్బందితో సహా అక్కడున్నవారంతా ట్రంపే బిల్లు కట్టబోతున్నాడని పొరబడ్డారు. అలా ఎవరికి కావాల్సింది వారు ఆర్డర్ చేసుకుని తినేసారు. తీరా చూస్తే ట్రంప్ ఆ రెస్టారెంట్‌లో ఏమీ తినకుండా తన ప్రైవేట్ ఫ్లైట్‌లోకి బర్గర్ తెప్పించుకుని తిన్నాడు. అలా వారి బిల్లు కట్టకుండానే ట్రంప్ వెళ్లిపోయాడు. దాంతో ట్రంప్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.