Adipurush: నిజంగానే వ‌చ్చిన హ‌నుమంతుడు..!

Hyderabad: ప్ర‌భాస్ (prabhas) న‌టించిన ఆదిపురుష్ (adipurush) సినిమా ఈరోజు రిలీజ్ అయింది. రాముడు ఎక్క‌డుంటే అక్క‌డ హ‌నుమంతుడు (hanuman) ఉంటాడు అన‌డానికి ఈ దృశ్య‌మే నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఆదిపురుష్ ఏ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యిందో ఆ థియేట‌ర్ల‌లో ఒక సీటు హ‌నుమంతుడి కోసం కేటాయించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణలోని ఓ థియేట‌ర్‌లోకి ఓ కోతి చొర‌బ‌డి సినిమాను వీక్షించింది. నిజంగానే హ‌నుమంతుడు వచ్చాడ‌నుకుని జై శ్రీరామ్ అంటూ థియేట‌ర్ అరుపుల‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది.