Adipurush బాలేద‌న్న యువ‌కుడు.. చిత‌క్కొట్టిన ఫ్యాన్స్

Hyderabad: ప్ర‌భాస్ (prabhas) న‌టించిన ఆదిపురుష్ (adipurush) దేశ‌వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయింది. అయితే.. హైద‌రాబాద్‌లోని ఓ థియేటర్ ద‌గ్గ‌ర రివ్యూలు తెలుసుకుంటుండ‌గా.. ఓ యువ‌కుడు సినిమా బాలేద‌ని చెప్పాడు. బాహుబ‌లిలో ప్ర‌భాస్ రాజుగా హుందాగా క‌నిపించాడు కానీ రాముడిలా మాత్రం అస్స‌లు స‌రిపోలేద‌ని చెప్పాడు. అత‌ను రివ్యూ చెప్తుండ‌గా.. ప‌క్క నుంచి వ‌చ్చిన ప్ర‌భాస్ ఫ్యాన్స్ కొంద‌రు ఏం మాట్లాడుతున్నావ్ రా.. అంటూ గొడ‌వ‌ప‌డ్డారు. సినిమా బాలేదు అన్నందుకు అత‌నిపై చేయిచేసుకున్నారు. ఈ గొడ‌వ మొత్తం అక్క‌డే ఉన్న మీడియా వారు రికార్డ్ చేయ‌డంతో వైరల్ అవుతోంది.