Naveen ul Haq: గొడవ మొదలెట్టింది విరాటే
Hyderabad: సమయంలో ముందు గొడవ మొదలుపెట్టిందే విరాట్ కోహ్లీ (virat kohli) అని అంటున్నాడు అఫ్గానిస్థానీ క్రికెటర్ నవీన్ ఉల్ హక్ (naveen ul haq). జరుగుతున్న సమయంలో లఖ్‌నౌ సూపర్ జైంట్స్ (lucknow super giants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (royal challengers banglore) మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. లఖ్‌నౌ మెంటార్ గౌతమ్ గంభీర్ (gautam gambhir) నోరు మూసుకోండి అని సైగ చేయడం.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో విరాట్ కూడా అలాగే సైగలు చేయడం ఇరు టీంల మధ్య గొడవకు దారి తీసింది. దీని గురించి నవీన్ ఓ సందర్భంలో స్పందించాడు. ముందు గొడవ స్టార్ట్ చేసింది విరాటే అని అన్నాడు.
“నేను సాధారణంగా ఎవ్వరితోనూ గొడవ పడను. విరాట్ స్లెడ్జింగ్ స్టార్ట్ చేసాడు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. మ్యాచ్ అయిపోయాక షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు విరాట్ నన్నేదో అన్నాడు. BCCI వేసిన ఫైన్స్ చూస్తే గొడవ ఎవరు స్టార్ట్ చేసారో మీకే తెలుస్తుంది. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా నేను స్లెడ్జింగ్ చేయను. ఒకవేళ చేస్తే బౌలింగ్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న వ్యక్తిపైనే చేస్తాను. నేను విరాట్‌కి షేక్ హ్యాండ్ ఇస్తుంటే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అందుకే నేను కూడా చెయ్యి తిప్పాను. మరి నేనూ మనిషినే కదా.. నాకు కోపం రాదా?” అని తెలిపాడు నవీన్.