Sreeleela: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. బ్యాక్ టు బ్యాక్ ఫ‌స్ట్‌లుక్స్!

Hyderabad: పెళ్లిసంద‌D (pellisandadi) సినిమాతో టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది క‌న్న‌డ భామ శ్రీలీల (sreeleela). అమెరికాలోని మిచిగ‌న్‌లో పుట్టి ఇండియా వ‌చ్చిన ఈ భామ 2019లో కిస్ అనే క‌న్న‌డ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. ఇక తెలుగులో పెళ్లిసంద‌డి సినిమాతో శ్రీలీల రేంజ్ పీక్స్‌కి వెళ్లిపోయింది. ఈరోజు 22 బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంటున్న శ్రీలీల‌కు విష్ చేయ‌డానికి వివిధ డైరెక్ట‌ర్స్, ప్రొడ్యూస‌ర్స్ ఆమె చేతిలో ఉన్న సినిమాల ఫ‌స్ట్‌లుక్స్ అన్నీ రిలీజ్ చేసేసారు. దాదాపు 7 సినిమాల‌తో శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటోంది. గుంటూరు కారం, ఆదికేశవ‌, నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, విజ‌య్ దేవ‌ర‌కొండ, నితిన్, రామ్‌ల‌తో క‌లిసి సినిమాలు చేస్తోంది. దీంతో పాటు జూనియర్ అనే క‌న్న‌డ సినిమాలో కూడా న‌టిస్తోంది. ఇంత త‌క్కువ టైంలో ఇన్ని ఆఫ‌ర్లు అందుకున్న హీరోయిన్ శ్రీలీలే అని చెప్పాలి. ఇంత వ‌ర‌కు బ‌ర్త్‌డే రోజు వ‌రుస‌గా 7 పోస్ట‌ర్లతో విషెస్ ఏ హీరోయిన్‌కైనా విషెస్ చెప్పారు అంటే అది కేవ‌లం శ్రీలీల‌కే (sreeleela) అని చెప్పాలి.