Gautam Gambhir: డ‌బ్బు కోసం చెత్త యాడ్స్‌లో న‌టిస్తారా?

Hyderabad: సీనియర్ క్రికెట‌ర్ల‌పై మండిప‌డ్డారు గౌత‌మ్ గంభీర్ (gautam gambhir). క‌పిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, సునీల్ గ‌వాస్క‌ర్‌లు సిల్వ‌ర్ ప‌ర్ల్స్ పాన్ మ‌సాలా యాడ్‌లో న‌టించ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. డ‌బ్బు కోసం ఎంత‌టి చెత్త యాడ్స్‌లోనైనా న‌టిస్తారా అని ప్ర‌శ్నించారు. అస‌లు సీనియ‌ర్ క్రికెట‌ర్స్ ఇలాంటి చెత్త యాడ్‌లో న‌టిస్తార‌ని తాను ఎప్పుడూ ఊహించ‌లేద‌ని అందుకే ఫ్యాన్స్‌కి మీ రోల్ మోడ‌ల్స్‌ని జాగ్ర‌త్త‌గా ఎంచుకోండి అని చెప్తుంటాన‌ని గంభీర్ అన్నారు. గుర్తింపు అనేది చేసే ప‌నుల‌తో వ‌స్తుంది కానీ పేరును బ‌ట్టి కాద‌ని తెలిపారు. డ‌బ్బు ముఖ్య‌మే కానీ ఇలాంటి చెత్త యాడ్స్‌లో న‌టించి సంపాదించేంత గొప్ప‌ది కాద‌ని డ‌బ్బే ముఖ్యం అనుకుంటే అది సంపాదించుకోవ‌డానికి ఎన్నో మార్గాలు ఉన్నాయ‌ని అన్నారు.

ఇలాంటి చెత్త యాడ్స్‌లో న‌టించాల‌ని ఎంత‌టి డ‌బ్బైనా ఇస్తామ‌ని చెప్తుంటార‌ని కానీ యువ‌త‌కు మంచి ఎగ్జాంపుల్‌గా నిల‌వాల్సినవారు ఆ డ‌బ్బు మాకు వ‌ద్ద‌ని చెప్ప‌గ‌లిగే ధైర్యం ఉండాల‌ని అన్నారు. గ‌తంలో స‌చిన్ తెందుల్క‌ర్‌కు (sachin tendulkar) 30 కోట్లు ఇస్తాం పాన్ మ‌సాలా యాడ్‌లో న‌టించాల‌ని అడిగిన‌ప్పుడు అత‌ను అస్స‌లు ఒప్పుకోలేద‌ని గుర్తుచేసారు.