Tamanna: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కిస్ సీన్ అనుకున్నా!

Mumbai: ల‌స్ట్ స్టోరీస్-2 (lust stories 2) అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (tamanna). ఇందులో ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్ విజ‌య్ వ‌ర్మ‌తో (vijay verma) క‌లిసి న‌టించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మితిమీరిన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అయితే ఫ‌స్ట్ స్క్రిప్ట్ చ‌దువుతున్న‌ప్పుడు కిస్ సీన్స్ ఉన్నాయ‌ని తెలీగానే ఎవ‌రితో చేయాలి అని డైరెక్ట‌ర్‌ని అడిగార‌ట‌. ఇందుకు ఆ డైరెక్ట‌ర్ విజ‌య్‌తో చేయాలి అని చెప్పార‌ట‌. విజ‌య్ పేరు విని విజ‌య్ దేవ‌ర‌కొండ‌నా? (vijay devarakonda) అని అడిగార‌ట త‌మ‌న్నా. ఆ త‌ర్వాత తెలిసి విజ‌య్ దేవ‌ర‌కొండ కాదు విజ‌య్ వ‌ర్మ అని. “స్క్రిప్ట్ చ‌దువుతుంటే అన్నీ కిస్ సీన్స్ ఉన్నాయి. జ‌స్ట్ చెయ్యి ప‌ట్టుకుని హ‌గ్ చేసుకుంటా అని చెప్పా. కానీ వెబ్‌సిరీస్‌లో ఆ కిస్సింగ్ సీన్ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎవ‌రితో చేయాలి అని అడిగితే విజ‌య్ అన్నారు. నేను విజ‌య్ దేవ‌ర‌కొండ‌నా అని అడిగా. కాదు విజ‌య్ వ‌ర్మ అన్నారు. దాంతో స‌రేలే అనుకున్నా” అని తెలిపారు త‌మ‌న్నా.