Devara: కొంత‌కాలం పాటు నో అప్‌డేట్స్..!

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) న‌టిస్తున్న దేవ‌ర (devara) సినిమా నుంచి కొంత‌కాలం పాటు ఎలాంటి అప్డేట్స్ రావ‌ని టీం తెలిపింది. కొర‌టాల శివ (koratala siva) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జ‌రిగిపోతోంది. దాంతో ఇప్పుడిప్పుడే ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేమ‌ని టీం చెప్పిన‌ట్లు తెలుస్తోంది. జాన్వి క‌పూర్‌ (janhvi kapoor), ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్స్ పూర్త‌య్యాయ‌ని, ఇక విల‌న్‌గా న‌టిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కు (saif ali khan) సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. 2024 ఏప్రిల్ 5న ఎలాంటి పోస్ట్‌పోన్లు లేకుండా సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్స్ జరుగుతున్నాయి.