నాన్నే న‌న్ను లైంగికంగా వేధించాడు: ఖుష్బూ షాకింగ్ కామెంట్స్

క‌న్న‌తండ్రే త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు సినీ న‌టి, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలు ఖుష్బూ. మ‌హిళా దినోత్స‌వం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న సంద‌ర్భంగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఖుష్బూ త‌న‌కు చిన్న‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను పంచుకుని భావోద్వేగానికి గుర‌య్యారు. చిన్న‌త‌నంలో లైంగిక వేధంపుల‌కు గురైతే అది జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. ఈ విష‌యంలో అబ్బాయి, అమ్మాయి అన్న తేడా ఏమీ లేదు. నాకు ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి మా అమ్మ‌ను మా నాన్న హింసిస్తూనే ఉండేవాడు. నా తండ్రి ఎలాంటివాడంటే.. క‌ట్టుకున్న భార్య‌ను కొట్ట‌డం, క‌న్న కూతురిని లైంగికంగా వేధించ‌డం త‌న జ‌న్మ హ‌క్కుగా భావించే వ్య‌క్తి. నాకు 8 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్ప‌టి నుంచి నాన్న న‌న్ను లైంగికంగా వేధించ‌డం మొద‌లుపెట్టాడు. కానీ నాకు దానిని ఎదిరించే ధైర్యం 15 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చాక వ‌చ్చింది.

ఇన్నేళ్లు నేను సైలెంట్‌గా ఉండ‌టానికి కార‌ణం నా కుటుంబ స‌భ్యులు నింద‌లు ప‌డాల్సి వ‌స్తుంద‌న్న భయం. కానీ ఇప్పుడు నోరు తెరిచి నేను అనుభ‌వించిన న‌ర‌కాన్ని అంద‌రికీ తెలియ‌జేయాల‌ని అనుకున్నాను. నాకు చిన్న‌ప్ప‌టి నుంచి ఉన్న ఒకే ఒక్క భ‌యం ఏంటంటే.. నాన్న లైంగికంగా వేధిస్తున్నాడ‌న్న సంగ‌తి అమ్మకి చెబితే న‌మ్మ‌దు. ఎంద‌కంటే నాన్న ఏం చేసినా అత‌ను దేవుడితో స‌మానంగా చూసే వ్య‌క్తిత్వం మా అమ్మ‌ది. ఇక త‌ప్ప‌క నాకు 15 సంవ‌త్స‌రాలు వ‌చ్చాక మా నాన్న న‌న్ను వేధించ‌బోతుంటే నేనే ఎదురుతిరిగాను. నాకు 16 ఏళ్లు వ‌చ్చాక మా నాన్న మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆర్థికంగా చాలా క‌ష్టాలు ప‌డ్డాం. మాకు ఆహారం ఎక్క‌డి నుంచి వ‌స్తుంది అనుకుంటూ కొన్నేళ్ల పాటు ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్నాం. అంటూ త‌న చిన్న‌ప్ప‌టి విష‌యాల‌ను పంచుకున్నారు ఖుష్బూ.

ది బ‌ర్నింగ్ ట్రైన్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు ఖుష్బూ. ఆ త‌ర్వాత ఆమెకు సౌత్ నుంచి మంచి అవ‌కాశాలు రావ‌డంతో పాపుల‌ర్ అయిపోయారు. అలా కొంత‌కాలం పాటు సినిమాల్లో రాణించిన ఖుష్బూ.. 2010లో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు.