Modi Government: ట్విటర్ మాజీ CEO షాకింగ్ కామెంట్స్
Delhi: ట్విటర్ (twitter) మాజీ CEO జాక్ డోర్సే (jack dorsey).. మోదీ ప్రభుత్వంపై (modi government) షాకింగ్ కామెంట్స్ చేసారు. రెండేళ్ల క్రితం జరిగిన రైతుల ధర్నాలకు (farmers protest) సంబంధించిన వీడియోలు, ఫొటోలు ట్విటర్‌లో కనిపించకూడదని వాటిని డిలీట్ చేయకపోతే ఇండియాలో ఉన్న ట్విటర్ ఆఫీస్‌ని మూసివేయిస్తామని మోదీ ప్రభుత్వం బెదిరించినట్లు జాక్ తెలిపారు. రైతుల ధర్నాలకు సంబంధించి ఏ అకౌంట్ల నుంచి పోస్టులు వస్తున్నాయో వాటిని బ్లాక్ చేయాలని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. అలా చేయకపోతే ఆఫీస్‌ని మూసివేయించడమే కాకుండా ట్విటర్ ఉద్యోగుల ఇళ్లలో రైడ్లు జరిపిస్తామని హెచ్చరించారట. అయితే జాక్ డోర్సే చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. జాక్ డోర్సేవి పచ్చి అబద్ధాలని అన్నారు. భారత చట్టాలను గౌరవించని జాక్ డోర్సే కొన్ని నెలల పాటు తన ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడని, ఇక్కడ చట్టాలు అతనికి పట్టవన్నట్లు బిహేవ్ చేసేవాడని ఆరోపించారు. రైతులు ధర్నాలు చేపడుతున్న సమయంలో ట్విటర్‌లో జెనోసైడ్‌కు సంబంధించి తప్పుడు పోస్ట్‌లు కనిపించాయని వాటిని డిలీట్ చేయాలని చెప్పామే కానీ రైతుల ధర్నాలను కవర్ చేయొద్దని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ (congress) వర్గాలు మాత్రం ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి. ట్విటర్‌లో ఈ టాపిక్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. 2020లో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని ఏడాది పాటు రైతులు ధర్నా చేపట్టారు. దాంతో 2021 నవంబర్‌లో మోదీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది.