Pawan Kalyan: యాత్ర‌కి ముందు యాగం..!

AP: ఈ నెల 14న జ‌న‌సేనాని ప‌వన్ కళ్యాణ్ (pawan kalyan) వారాహి యాత్ర (varahi) ప్రారంభించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ యాగం చేపట్టారు. సోమవారం ఉదయం మొదలైన ఈ యాగం మంగళవారం కూడా కొనసాగనుంది. ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టిన‌ట్లు జ‌న‌సేన తెలిపింది.