బాల‌య్య మెచ్చిన సినిమా.. ఆనందంలో చిత్రబృందం!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు బాలకృష్ణ. ఈ ఏడాది ఆరంభంలోనే ‘వీర సింహారెడ్డి’తో సాలిడ్ హిట్ కొట్టిన బాలయ్య వరుస సినిమాలను లైన్లో పెట్టారు. అంతేకాదు ఆహా వేదికగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షో సీజన్ 3 కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇక వెబ్ సిరీస్లోనూ బాలకృష్ణ నటించబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే, తాజాగా బాలకృష్ణ తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ సినిమా బృందాన్ని పిలిచి అభినందించారు. బాలయ్య చేసిన పనికి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కోలివుడ్ స్టార్ హీరో ధ‌నుష్ హీరోగా వచ్చిన సార్ మూవీ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. తాజాగా ఈ సినిమా చూసిన బాలకృష్ణ చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందించారు. తమిళ స్టార్ హీరో ధ‌నుష్ హీరోగా వచ్చిన సార్ మూవీ ఫిబ్రవరి 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఇప్పటికే 2 వారాల సక్సెస్ఫుల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా చూసిన బాలకృష్ణ చిత్రబృందాన్ని అభినందించారు.

ప్రస్తుత విద్యా వ్యవస్థ తీరుని ఎత్తిచూపే లైన్ అప్‌తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రూపొందింది. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో, తెలుగులో ‘సార్’ పేరుతో విడుదలైంది. ట్రైలర్‌, టీజర్స్‌తో ఆకట్టుకున్న సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత నాగ వంశీ.. ప్రత్యేకంగా బాలకృష్ణ కోసం సార్ షో ప్రదర్శించారు. ఈ మూవీ చూసిన అనంతరం చిత్ర దర్శకుడిని, నిర్మాతని, నటీనటులను బాలయ్య అభినందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది మూవీ టీమ్. ‘సార్ సినిమా చూసి అభినందించిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. మీ స్పందన చూసి మేము చాలా థ్రిల్ అయ్యాం’ అని పోస్ట్ చేసి బాలయ్యతో దిగిన పిక్ షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించారు. హీరో సుమంత్ అతిథి పాత్రలో నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. చదువు చెప్పే గొప్పతనాన్ని తెలియజేసిన చిత్రం సార్. ఈ సినిమాలో విద్య గొప్పతనాన్ని తెలుపుతూ ఒక మాస్టర్గా బాల గంగాధర్ తిలక్ సాగించిన పోరాటం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లు రాబడుతోంది. ఇక మార్చి 22న నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తమిళం, తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఎన్ని వ్యూస్ రాబతుందో చూడాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.