Allu Arjun: ఇది క‌దా ప‌ర్‌ఫెక్ట్ కాంబో..!

Mumbai: స్టైలిష్ స్టార్.. గ్రీక్ గాడ్.. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్.. ఈ కాంబినేష‌న్ ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వ‌చ్చేస్తాయ్. అలాంటిది ఈ ముగ్గురూ ఒకే ద‌గ్గ‌ర క‌లిస్తే..! స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) ఇటీవల ముంబై వెళ్లారు. ప్ర‌ముఖ నిర్మాత మ‌ధు మంతెన (madhu mantena) త‌న వివాహ వేడుకకు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో పాటు అల్లు అర్జున్‌ని (allu arjun) కూడా పిలిచారు. ఈ వేడుక‌కు బ‌న్నీ అటెండ్ అయ్యారు. ఆ స‌మ‌యంలో అక్కడే ఉన్న గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్‌ (hrithik roshan), మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్‌ల‌ను (aamir khan) క‌లిసి ముచ్చ‌టించారు. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.