Avika Gor: టాలీవుడ్‌లోనే నెపోటిజం ఎక్కువ
Hyderabad: టాలీవుడ్‌లోనే ఎక్కువ నెపోటిజం (nepotism) ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నటి అవికా గోర్ (avika gor). చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో ఫేమస్ అయిపోయిన అవిక చైల్డ్ యాక్టర్‌గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 17 ఏళ్ల వయసులోనే తెలుగులో అక్కినేని నాగార్జున నిర్మించిన ఉయ్యాల జంపాలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రాజ్ తరుణ్, అవికలకు ఇది ఫస్ట్ సినిమా. ఈ సినిమాతోనే ఇద్దరూ మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించింది. తన రీసెంట్ ఫిలిం పాప్‌కార్న్ అట్టర్ ఫ్లాప్ అయింది.
అయితే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ నిర్మాత విక్రమ్ భట్ కూతురు కృష్ణా భట్ డైరెక్ట్ చేస్తున్న 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమాలో అవిక నటిస్తోంది. ఈ సందర్భంగా సౌత్ సినిమాలకు బాలీవుడ్‌కి మధ్య ఏమైనా డిఫరెన్స్ కనిపించా అని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. అవిక నెపోటిజం టాపిక్ గురించి ప్రస్తావించింది. చాలా మంది బాలీవుడ్‌లో నెపోటిజం ఉందని అంటుంటారు కానీ నిజానికి టాలీవుడ్‌లోనే ఎక్కువగా ఉందని కానీ ఎవ్వరూ చూడనట్లు బిహేవ్ చేస్తుంటారని తెలిపింది. బాలీవుడ్‌లో తెలుగు సినిమాల గురించి గొప్పగా చెప్పుకుంటుంటే టాలీవుడ్‌లో మాత్రం చులకనగా చూస్తారని పేర్కొంది. ఒకప్పుడు తెలుగు సినిమాలన్నీ రీమేక్స్ ఉండేవని, కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను కాపీ కొడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారని తెలిపింది. సినిమాలు తీసే విధానం గురించి మాట్లాడి ఉంటే బాగుండు కానీ అనవసరంగా నెపోటిజం టాపిక్ తీసి చిక్కుల్లో పడింది అవిక.