Kasturi Shankar: ఆదిపురుష్‌లో ప్ర‌భాస్ క‌ర్ణుడిలా ఉన్నాడు..!

Hyderabad: ఆదిపురుష్ (adipurush) సినిమాలో ప్ర‌భాస్ (prabhas) రాముడిలా కంటే మ‌హాభారతంలో క‌ర్ణుడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేసారు న‌టి క‌స్తూరి శంక‌ర్ (kasturi shankar). రామాయ‌ణాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్లు చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఫెయిల్ అయ్యార‌ని మండిప‌డ్డారు. సినిమాలో చూపించిన క్యారెక్ట‌ర్లు చాలా డిస్ట‌ర్బింగ్‌గా ఉన్నాయ‌ని అన్నారు. అస‌లు ఏ యాంగిల్ నుంచి చూసినా ప్ర‌భాస్ రాముడిలా లేడ‌ని క‌ర్ణుడిలా క‌నిపిస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. రామ ల‌క్ష్మ‌ణుల‌కు గెడ్డం, మీసాలు ఉన్న‌ట్లు ఏ రామాయ‌ణంలోనూ చూడ‌లేద‌ని అందులోనూ ఎంద‌రో తెలుగు లెజెండ్స్ న‌టించిన రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ (prabhas) ఇలా క‌నిపించ‌డం షాకింగ్‌గా ఉంద‌ని అన్నారు. ఈ సినిమా జూన్ 16న రిలీజ్ అవ‌బోతోంది.