ఎలుక‌లా ఉండే అత‌ను రాముడు.. రాముడిలా ఉండే య‌ష్ రావ‌ణుడా?

Mumbai: బాలీవుడ్ న‌టి కంగనా ర‌నౌత్ (kangana ranaut) మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేసారు. బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్‌ (ranbir kapoor), క‌న్న‌డ రాక్‌స్టార్ య‌ష్‌ (yash)లను ఉద్ద‌శిస్తూ కంగ‌న చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ నితీష్ తివారీ రామాయ‌ణం (ramayana) తీయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందులో రాముడిగా ర‌ణ్‌బీర్ క‌పూర్‌ని సీత‌గా ఆలియా భ‌ట్‌ని (alia bhatt) పెట్టి తీయాల‌ని అనుకుంటున్న‌ట్లు ఆయ‌న మీడియా ముందు ప్ర‌క‌టించారు. ఇందులో రావ‌ణాసురుడిగా య‌ష్‌ని పెట్టాల‌నుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. దీనిపై కంగ‌న స్పందించారు. “డ్ర‌గ్స్‌కి అల‌వాటు ప‌డి, అమ్మాయిల‌ను వాడుకుని వ‌దిలేసి, బ్ర‌హ్మాస్త్ర సినిమాలో శివుడి అవ‌తారాన్ని బ‌ల‌వంతంగా జ‌నాల‌పై రుద్ది, ద‌రిద్ర‌మైన ప‌నులు చేస్తూ తెల్ల ఎలుక‌లా క‌నిపించే అత‌ను రాముడా? ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న‌కంటూ సొంత పేరు గుర్తింపు తెచ్చ‌కుని వాల్మీకీ చెప్పిన‌ట్లు రాముడి పోలిక‌లు ఉన్న య‌ష్ రావ‌ణాసురుడా? ఇదెక్క‌డి క‌లియుగం? డ్ర‌గ్స్ తీసుకునే అబ్బాయి రాముడి పాత్ర‌లో న‌టించ‌కూడ‌దు. జై శ్రీరామ్” అని పోస్ట్ చేసారు.