Lavanya Tripathi: పెళ్లయ్యాక సినిమాలు మానేస్తుందా?
Hyderabad: పెళ్లయ్యాక లావణ్య త్రిపాఠి (lavanya tripathi) యాక్టింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో (varun tej) ఎంగేజ్‌మెంట్ అనగానే చాలా మంది నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న ఇది. అసలు లావణ్య త్రిపాఠితో పెళ్లి మెగా ఫ్యామిలీకి ఇష్టంలేదని ఒక టాక్ ఉంది. ఎందుకంటే.. ఇద్దరూ సినీ ఇండస్ట్రీకే చెందినవారైతే వారి బంధం నిలబడదని వారి భయం. అందుకే గతంలో సాయి ధరమ్ తేజ్.. నటి రెజీనాతో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చినా.. హీరోయిన్‌ని మాత్రం కోడలిగా వద్దు అని ఇంట్లోవారు చెప్పడంతో వారిద్దరూ విడిపోయినట్లు అప్పట్లో టాక్ వచ్చింది. మరి ఇప్పుడు లావణ్య పెళ్లయ్యాక సినిమాలు చేస్తుందా మానేస్తుందా అనేది పెద్ద ప్రశ్న. తన చేతిలో ఉన్న సినిమాలు అన్నీ కంప్లీట్ చేసేసి ఫ్యామిలీ ఉమెన్‌లా మారిపోతే ఎలాంటి సమస్య ఉండదు. వరుణ్ ఎటూ సినిమాలతో బిజీగా ఉంటాడు కాబట్టి తనకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తే వారి బంధంలో ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.
ఎందుకంటే హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితంలో దాదాపు ప్రొఫెషనల్ పరంగా గొడవలు వచ్చి విడిపోయినవారే ఎక్కువగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగచైతన్య, సమంతలనే తీసుకుందాం. ఎనిమిదేళ్లు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటైంది ఈ జంట. కానీ నాలుగేళ్లకే మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి కానీ ఆ కారణాల్లో ఒకటి సమంత సినిమాలు కంటిన్యూ చేయడం, పైగా కాస్త మితిమీరిన పాత్రల్లో నటించడమే అని కూడా అంటున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల విషయంలో కూడా అదే జరిగిందని టాక్ నడుస్తోంది. ఇందుకు కారణం పెళ్లి తర్వాత కూడా నిహారిక సినిమాలు చేస్తా అనడమేనని టాక్.