Varun Tej: వేడుక‌గా ఎంగేజ్‌మెంట్.. మెగా హీరోల సంద‌డి

Hyderabad: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ (varun tej).. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిల (lavanya tripathi) నిశ్చితార్ధం ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబీకులు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ప్రైవేట్ వేడుక‌గా నిశ్చితార్ధం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న‌, అల్లు అర్జున్ వేడుక‌కు హాజ‌రయ్యారు. నిశ్చితార్థం ఫొటోల‌ను వ‌రుణ్‌, లావ‌ణ్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. వ‌రుణ్ నా ల‌వ్ దొర‌కేసింది అని పోస్ట్ చేయ‌గా.. లావ‌ణ్య నా ఫ‌రెవ‌ర్ దొరికేసాడు అని క్యాప్షన్ ఇచ్చారు. ఇద్ద‌రి జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే పెళ్లి వేడుక జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.