Arranged Marriages: పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు నో..!
Hyderabad: ఒకప్పుడు యువతీ యువకులు పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లే (arranged marriages) చేసుకునేవారు. లవ్ మ్యారేజ్ (love marriage) చేసుకుంటే అదేదో పాపం అయినట్లు చూసేవారు. ఇప్పులు అలా కాదు. అయితే లవ్ మ్యారేజ్ లేదా నో మ్యారేజ్ అనేలా అయిపోయింది పరిస్థితి. పెద్దలు కుదిర్చిన వివాహాల సంఖ్య భారీగా పడిపోయింది. వెడ్డింగ్ వైర్ ఇండియా సర్వే ప్రకారం అరేంజ్డ్ మ్యారేజీల సంఖ్య 24 శాతానికి పడిపోయినట్లు తేలింది. ఇక పెళ్లిళ్ల ప్లానింగ్ విషయానికొస్తే.. 41% శాతం మంది 5 నుంచి 6 నెలల ముందుగానే ప్లానింగ్ చేసుకుంటున్నారు. 32% మంది కేవలం 3 నెలలు ముందుగానే పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక నిశ్చితార్ధ సమయం ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలోనే తక్కువగా ఉంటోందట. అంటే పెళ్లికి ఆరు లేదా మూడు నెలలు ముందు నిశ్చితార్ధ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువత ఎంతగా ఆలోచిస్తున్నారంటే.. పెళ్లి తర్వాత కలిసి ఉంటారో లేదో తెలుసుకోవడానికి లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. ఇలా ఉంటున్నవారి సంఖ్య అమెరికాలో కంటే ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో ఎక్కువగా ఉంటోంది. గుడ్ న్యూస్ ఏంటంటే లవ్ మ్యారేజస్ చేసుకుంటున్న భారతీయ యువత మన సంప్రదాయాలకు విలువలను మర్చిపోవడంలేదు.