Viral News: లావుగా ఉన్నావ‌న్న భ‌ర్త‌.. తిండి మానేసి ఇలా..!

Russia: బుగ్గ‌లు లావుగా ఉన్నాయ్ అని భ‌ర్త అన‌డంతో తెగ ఫీలైపోయిన ఓ మ‌హిళ కడుపు మాడ్చుకుని అస్తిపంజ‌రంలా (viral news) అయిపోయింది. ఈ ఘ‌ట‌న ర‌ష్యాలో (russia) చోటుచేసుకుంది. యానా బోబ్రోవా అనే మ‌హిళ స్థానికంగా ఓ ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డంతో ఆమె గురించి అంద‌రికీ తెలిసింది. బెల్గోరోడ్ ప్రాంతానికి చెందిన యానా చూడ‌టానికి చాలా అందంగా ఉండేది. కానీ ఆమె భ‌ర్త లావుగా ఉన్నావ్.. బుగ్గ‌లు ఊగుతున్నాయ్ అని అన‌డంతో ఎలాగైనా సన్న‌గా అవ్వాల‌ని తిండి మానేసింది. దాంతో ఇప్పుడు ఆమె బ‌రువు 22 కిలోలు మాత్ర‌మే ఉంది. చూడ‌టానికి అస్తిపంజ‌రంలా మారిపోయి భ‌యంక‌రంగా త‌యారైంది.

ర‌ష్యాకు చెందిన బియాండ్ ది బార్డ‌ర్ అనే టీవీ షో ద్వారా ఈమె విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. యానా యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంటున్న‌ప్పుడే స‌న్నగా అవ్వాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. దాంతో రోజులో క‌ప్పు టీ, బిస్కెట్లు, చిన్న చీజ్ ముక్క‌, నీళ్లు త‌ప్ప ఇంకేమీ తినేది కాద‌ట‌. తను అస్తిపంజ‌రంలా మారిపోతున్నా కూడా యానా భ‌ర్త అలా చేయొద్దు అని చెప్పేవాడు కాదట‌. పైగా బ‌య‌టి వారితో మాట్లాడ‌నిచ్చేవాడు కాద‌ట‌. ఉద్యోగం కూడా మానిపించేసాడ‌ని చెప్పింది. త‌న భ‌ర్త కోసం ఇంత‌గా స‌న్న‌బ‌డితే చివ‌రికి త‌న‌ను వ‌దిలేసి వెళ్లిపోయాడ‌ని చెప్పి బాధ‌ప‌డింది. యానా ప‌రిస్థితి చూసి వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆమెకు ఫ్లూయిడ్స్ బాగా అందేలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. నెల రోజుల్లో యానా కాస్త బ‌రువు పెర‌గ‌క‌పోయినా ప్రాణాల‌కే ప్ర‌మాదం అని తెలిపారు. ఇంత చేసినా త‌న భ‌ర్త‌ది ఏ త‌ప్పూ లేదని ఇలా కావ‌డానికి త‌నే కార‌ణ‌మ‌ని చెప్తోంది యానా.