America: ఆత్మహత్య చేసుకున్న తమిళ యువతి
America: అమెరికాలో (america) ఓ తమిళ (tamilnadu) యువతి ఆత్మహత్య చేసుకుంది. పిల్లాడితో అమెరికాలోని కొలరాడోలో నివసిస్తున్న ఉంటున్న భవానీ అనే యువతి కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతోంది. అదీకాకుండా తన స్వస్థలంలో ఉంటున్న అమ్మకు తీవ్ర అనారోగ్యం కావడంతో భవానీ మరింత కుంగిపోయింది. దాంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కొలరాడోలోని వెస్ట్మిన్స్టర్ ప్రాంతంలో ఉన్న స్టాండ్లే సరస్సులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చూసిన ఓ వ్యక్తి వెంటనే వెళ్లి కాపాడాలని అనుకున్నా కూడా ప్రయోజనం లేకుండాపోయింది. భవానీ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు కావాల్సిన డబ్బుల కోసం ఆమె స్నేహితురాలు గన్నమని ఫండ్స్ కలెక్ట్ చేస్తోంది.