‘నువ్వంటే చెప్పలేనంత ఇష్టం’.. సామ్ మనసులో మాట
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, డైరెక్టర్ నందినీ రెడ్డి మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఓ బేబి’ సమంత కెరీర్లో మైలురాయిగా నిలిచింది. తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో సోషల్‌మీడియా ద్వారా పంచుకునే సమంత తాజాగా చేసిన పోస్ట్ వైరలవుతోంది. మార్చి 4న నందిని రెడ్డి బర్త్‌డే సందర్భంగా విషెస్ చెబుతూ సమంత పెట్టిన పోస్ట్ వారిద్దరి మధ్య స్నేహం ఎంత దృఢమైందో చెప్పకనే చెబుతోంది. ‘నందినీ రెడ్డి లాంటి స్నేహితురాలు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఉండాలి. నీ స్నేహం జీవితంలో ఎదురయ్యే బాధలు, కష్టాలను దరి చేరనీయదు. బాధను మైమరపిస్తూ ఎప్పుడూ నవ్విస్తుంటావు. నువ్వు లేకపోతే జీవితంలో నేనేం చేయలేను. నువ్వంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. హ్యాపీ బర్త్‌డే నందినీ రెడ్డి’ అంటూ తన స్నేహితురాలిపై ప్రేమను చాటుకుంది సమంత.
సమంత పెట్టిన పోస్ట్‌కి నందినీ రెడ్డి ‘సామ్.. బిగ్ హగ్స్’ అంటూ ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చింది. సమంత పోస్ట్ చూసిన నెటిజనులు నందినీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతోపాటు వారిద్దరి స్నేహం గురించి అభిమానులు తెగ ముచ్చటపడుతున్నారు. సమంత- నందినీ రెడ్డి కాంబోలో ‘జబర్దస్త్’ మూవీ వచ్చింది. ఈ సినిమా సమయంలోనే సిద్ధార్థ్ తో సమంత ప్రేమలో పడి.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పిందనే వార్తలు చూశాం. ఇక రీసెంట్ గా ఓ బేబీ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సక్సెస్ అయ్యారు సమంత- నందినీ రెడ్డి.
ఇదివరకు సమంత- నందినీ రెడ్డి కాంబోలో ‘జబర్దస్త్’ మొదటి మూవీగా వచ్చింది. ఇక రీసెంట్ గా ఓ బేబీ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సక్సెస్ఫుల్ కాంబినేషనగా హిట్ కొట్టారు.
విడాకుల తర్వాత తన కెరీర్ పై పూర్తి ఫోకస్ పెట్టింది సమంత. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మయోసైటిస్ వంటి అరుదైన సమస్యతో పోరాడుతూ మనోధైర్యంతో సమంత దూసుకుపోతున్న తీరు అందరి మనసు దోచుకుంటోంది. ఈ మధ్య కాస్త ఆరోగ్యం కుదుటపడటంతో ఇదివరకే కమిటైన సినిమాలకు డేట్స్ ఇస్తూ వస్తోంది.
గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసిన సమంత.. రాజ్- డీకే తెరకెక్కిస్తున్న సిడాటెల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. అంతేకాదు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా చేస్తోంది సమంత. ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.