Ranbir Kapoor: ఫ్రీగా 10,000 టికెట్స్!

Hyderabad: బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ (ranbir kapoor) ఓ వినూత్న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌భాస్ (prabhas) న‌టించిన ఆదిపురుష్ (adipurush) సినిమా ఈ నెల 16న విడుద‌ల అవుతున్న సంద‌ర్భంగా ప‌ది వేల టికెట్లు ఉచితంగా పంపిణీ చేయాల‌నుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ర‌ణ్‌బీర్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దాదాపు 6 భాష‌ల్లో రిలీజ్ అవుతున్న ఆదిపురుష్ సినిమాను అంద‌రూ త‌రించాల‌ని, కానీ పేద పిల్ల‌లు టికెట్స్ కొనుక్కోలేరు కాబ‌ట్టి వారి కోసం 10,000 టికెట్లు ఫ్రీగా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రోప‌క్క కార్తికేయ‌-2 సినిమా ప్రొడ్యూసర్ అభిషేక్ అగ‌ర్వాల్ (abhishek agarwal) కూడా తెలంగాణ‌లో 10,000 టికెట్లు ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జీవితంలో ఒక‌సారి రిలీజ్ అయ్యే ఇలాంటి సినిమాను అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాలని, రామ భ‌క్తుడిగా త‌న‌వంతు సాయం చేయాల‌నుకుంటున్నాన‌ని అభిషేక్ తెలిపారు.