Jr NTR: తారక్ కొత్త డెసిషన్..!
Hyderabad: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (jr ntr) సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌజ్ (production house) స్టార్ట్ చేద్దామనుకుంటున్నారట. ఇండియాలోనే అతిపెద్ద స్టార్లలో ఒకరైన తారక్ (tarak).. తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా అవుట్ సైడర్స్కి ఛాన్సులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే భారీ సినిమాలు కాకుండా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను మాత్రమే నిర్మించాలని తారక్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తన అన్న కళ్యాణ్ రామ్ (kalyan ram) సాయం కూడా తీసుకోవాలనుకుంటున్నారట. త్వరలో ఏ విషయం అన్నది ప్రకటించనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ (ram charan), మహేష్ బాబు (mahesh babu), ప్రభాస్‌లకు (prabhas) సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు తారక్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోనున్నారు. అయితే మహేష్, ప్రభాస్‌లు తమ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఇతర హీరోలతో సినిమాలు చేస్తున్నారు కానీ.. రామ్ చరణ్ మాత్రం కేవలం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాలు చేస్తున్నారు. అయితే ఇటీవల రామ్ చరణ్.. యూవీ క్రియేషన్స్‌తో కలిసి మరో ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. బహుశా ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేస్తారేమో వేచి చూడాలి.