Sushmita Sen పోలిక‌లు వ‌చ్చాయి..మ‌ర‌ద‌లి కామెంట్స్!

Mumbai: బాలీవుడ్ న‌టి సుస్మితా సేన్ (sushmita sen) మ‌ర‌ద‌లు చారూ అసోపా సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. టీవీ న‌టి అయిన చారూ అసోపా (charu asopa).. సుస్మితా సేన్ త‌మ్ముడు రాజీవ్ సేన్‌ను (rajeev sen) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి పండంటి ఆడ‌పిల్ల పుట్టింది. బిడ్డ పుట్టిన త‌ర్వాత నుంచి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు చోటుచేసుకున్నాయి. దాంతో ఇద్ద‌రూ విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. చారూ అసోపా త‌న కూతురు జియానాతో క‌లిసి దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా పోస్ట్ చేస్తుంటుంది. ఈ విష‌యంలోనూ రాజీవ్, అసోపా మ‌ధ్య చాలా సార్లు వాద‌న‌లు జ‌రిగాయి. అయినా కూడా అసోపా పాప ఫోటోల‌ను అందరికీ చూపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చాలా మంది నెటిజ‌న్లు పాప ఏంటి అంత పెద్ద‌దానిలా ఉంది ఉంది? అని కామెంట్స్ చేసారు. దాంతో చారూ అసోపాకు ఒళ్లు మండింది. వాళ్లంద‌రికీ ఓ ఇంట‌ర్వ్యూలో ఆన్స‌ర్ ఇచ్చింది.

“నా కూతురి వ‌య‌సు 18 నెల‌లు. కానీ మూడేళ్ల పిల్ల‌లా ఉంటుంది. ఇందుకు కార‌ణం సుస్మితా సేన్, వాళ్ల నాన్న‌లే. వాళ్లు పొడుగ్గా ఉంటారు. వారి పోలిక‌లే వ‌చ్చి ఉంటాయి. ఆ మాత్రం తెలీకుండా ఎందుకు పాప గురించి అలాంటి కామెంట్స్ చేస్తారు. గ‌తంలో కూడా పాపకి ఇంకా న‌డ‌క రాలేదు అని కామెంట్స్ చేసారు. చిన్న పిల్ల అని కూడా చూడ‌టం లేదు. పాప ఎలా ఉండాలి అనేది కూడా వాళ్లే డిసైడ్ చేసేస్తున్నారు” అని మండిప‌డ్డారు చారూ.