Adipurush: U స‌ర్టిఫికేట్.. 3 గంట‌ల సినిమా..!

Hyderabad: ప్ర‌భాస్ (prabhas) న‌టించిన ఆదిపురుష్ (adipurush) సినిమాకు సెన్సార్ బోర్డు U స‌ర్టిఫికేట్ ఇచ్చింది. అంతేకాదు సినిమా ర‌న్‌టైంను నిమిషం త‌క్కువ 3 గంట‌ల‌కు కుదించింది. భార‌తీయ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ర‌న్‌టైం క‌లిగిన సినిమా ఇదే అంటున్నారు. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల తిరుప‌తిలో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ రామ‌య్య‌గా, కృతి స‌న‌న్ (kriti sanon) సీత‌మ్మ‌గా న‌టించిన ఈ సినిమా కోసం యావ‌త్ భార‌త దేశంలో వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోంద‌నే చెప్పాలి. ఈ నెల 16న 6 భాష‌ల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమా త్వ‌ర‌లో రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా టీం ఇటీవ‌ల ఓ ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ కూడా చేసింది. సినిమా రిలీజ్ అయ్యే ప్ర‌తి థియేట‌ర్‌లో హ‌నుమంతుడి కోసం ఓ సీటు ఖాళీగా వ‌దిలేయాని చెప్పింది. రాముడు ఎక్కడ ఉంటే హ‌నుమంతుడు అక్క‌డ కొలువై ఉంటాడు అంటారు కాబ‌ట్టి.. త‌న రామ‌య్య సినిమాను చూసుకునేందుకు హ‌నుమంతుడు కూడా థియేట‌ర్ల‌కు వ‌స్తాడు అన్న న‌మ్మ‌కంతో టీం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.