Anasuya Bharadwaj: డబ్బులిచ్చి బూతులు తిట్టించారు
Hyderabad: యాంకర్ అనసూయ (anasuya bharadwaj) ఈ మధ్యకాలంలో చాలా సార్లు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారారు. ఎక్కువగా విజయ్ దేవరకొండకు (vijay devarakonda) సంబంధించిన విషయంలో అనసూయ చాలా ట్రోల్స్ ఫేస్ చేసారు. అయితే ట్రోల్స్ అన్నీ డబ్బులిచ్చి చేయించినవే అని అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆమె నటించిన విమానం (vimanam) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టారు.
“ఒకప్పుడు నాకు విజయ్‌కి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇదంతా అర్జున్ రెడ్డి సినిమా వల్లే మొదలైంది. అర్జున్ రెడ్డిలో అమ్మను ఉద్దేశించి తిట్టే బూతులు ఉండంతో సెన్సార్ మ్యూట్ చేసింది. అయితే ప్రమోషన్స్ కోసం విజయ్ ఆ బూతు పదాన్ని థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు మీరే అరవండి అని ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టాడు. అది చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఓ తల్లినే. ఇదే విషయాన్ని నేను విజయ్‌తో కూడా చర్చించాను. ఆ తర్వాత మా మధ్య అంతా మామూలు ఆయిపోయింది. విజయ్ వాళ్ల నాన్న మీకు మాత్రమే చెప్తా సినిమాలో నాకు రోల్ కూడా ఆఫర్ చేసారు. అయితే నాకు ఈ మధ్యనే ఓ షాకింగ్ విషయం తెలిసింది. విజయ్ పబ్లిసిస్ట్ ట్రోలర్స్‌కి డబ్బులు ఇచ్చి మరీ నన్ను బూతులు తిట్టించారట. అది విని నేను షాకయ్యా. అదే నిజం అయితే విజయ్‌కి తెలీకుండా ఎలా ఉంటుంది. విజయ్‌తో ఏమీ చెప్పకుండా పబ్లిసిస్ట్ ఏమీ చేయలేడు కదా. పోనీ విజయ్‌కి ఆ విషయం తెలీకపోయినా నాపై అంత దారుణంగా ట్రోల్స్ చేస్తుంటే అలా చేయొద్దు అని విజయ్ ఒక్క మాట వారితో చెప్పచ్చు కదా. నేను విసిగిపోయాను. నాకు ప్రశాంతత కావాలి. అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అనుకుంటున్నా” అని తెలిపారు.