Adipurush: ముద్దు ఘ‌ట‌న‌.. చిలుకూరు బాలాజీ అర్చ‌కుడి ఆగ్ర‌హం

Hyderabad: ఆదిపురుష్ (adipurush) డైరెక్ట‌ర్ ఓం రౌత్ (om raut).. హీరోయిన్ కృతి స‌న‌న్‌ను (kriti sanon) తిరుమ‌ల‌లో ముద్దుపెట్టుకున్న ఘ‌ట‌న తీవ్ర చర్చ‌కు దారి తీసింది. మంగ‌ళ‌వారం తిరుప‌తిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సంద‌ర్భంగా ఆదిప‌రుష్ టీం శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకుంది. ముందు ప్ర‌భాస్ ద‌ర్శ‌నం చేసుకున్నాక కృతి స‌న‌న్, ఓం రౌత్ క‌లిసి ద‌ర్శ‌నానికి వెళ్లారు. ద‌ర్శ‌నం అనంత‌రం కృతి కారు ఎక్కి వెళ్తుండ‌గా.. ఓంరౌత్ బై చెప్తూ హ‌గ్ చేసుకుని బుగ్గ‌పై ముద్దుపెట్టుకున్నాడు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న‌పై చిలుకూరు బాలాజీ (chilukur balaji) ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు స్పందించారు. ఇదేం పాడుపని అంటూ మండిప‌డ్డారు. “ఇది తీవ్రంగా ఖండించాల్సిన ఘ‌ట‌న‌. భార్యాభ‌ర్త‌లు కూడా క‌లిసి తిరుమ‌ల వెళ్ల‌రు. అలాంటిది మీరు ఇలా ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు. కావాలంటే హోట‌ల్ గ‌దికి వెళ్లండి. మీ ప‌ద్ధ‌తి రామాయ‌ణాన్ని, సీత‌మ్మ‌వారిని అగౌర‌వ‌ప‌రిచే విధంగా ఉంది” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. జూన్ 16న ఆదిపురుష్ (adipurush) రిలీజ్ ఉంది. ఈ స‌మ‌యంలో ఓం రౌత్, కృతి స‌న‌న్ వివాదంలో చిక్కుకున్నారు.