Wrestlers Protest: లైంగికంగా వేధించలేదు.. మైనర్ తండ్రి యూ టర్న్!
Delhi: కొంతకాలంగా లైంగిక ఆరోపణలు (wrestlers protest) ఎదుర్కొంటున్న రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wfo) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ (brij bhushan singh) కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ బయటికి వచ్చింది. పలువురు భారతీయ రెజ్లర్లు తమను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత ఓ మైనర్ రెజ్లర్ కూడా బ్రిజ్ భూషణ్‌పై కేసు పెట్టడంతో రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నెలలోపు బ్రిజ్ భూషణ్‌పై (brij bhushan singh) చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మైనర్ బాలిక తండ్రి యూ టర్న్ తీసుకున్నారు. బ్రిజ్ భూషణ్ తన కూతుర్ని లైంగికంగా వేధించలేదని, ఓ మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో తన కూతురు లైంగిక ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. లైంగికంగా వేధించకపోయినా తన పట్ల పక్షపాతంతో వ్యవహరించాడని అన్నారు. ఈ మేరకు పాత కేసు కొట్టిపారేసి కొత్తగా మరో స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిపారు.
“నా కూతురు 2022లో ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నప్పుడు బ్రిజ్ భూషణ్ తన పట్ల పక్షపాతంగా వ్యవహరించాడు. దాంతో తను ఓడిపోయింది. ఆ కోపంతో లైంగిక ఆరోపణలు చేసింది. అందులో నిజం లేదు. అలాగని బ్రిజ్ భూషణ్ మంచివాడు అనడంలేదు. నా కూతురి పట్ల పక్షపాతంతో వ్యవహరించాడని కొత్త స్టేట్మెంట్ రికార్డ్ చేయించి ఫిర్యాదు చేసాను. నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వారి పేర్లు బయటపెట్టను. నా కూతురి కోసమే పోరాడుతున్నాను” అని తెలిపారు.