Litchi: లిచి లాభాలు తెలిస్తే వ‌దిలిపెట్ట‌రు

Hyderabad: వేస‌విలో దొరికే లిచి పండ్లు (litchi) తింటే క‌లిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. కాస్త ధ‌ర ఎక్కువైనా దీని నుంచి వ‌చ్చే పోష‌కాలు తెలిస్తే వెంట‌నే కొనేస్తారు. లిచి పండ్ల‌ను (litchi) రామ్ భుటాన్ అని కూడా అంటారు. ఇంత‌కీ ఇందులో ఉండే లాభాలేంటో తెలుసుకుందాం.

  • లిచి పండ్ల‌లో విటమిన్ సి మెండుగా ఉంటుంది. దాంతో బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి.
  • ఇమ్యూనిటీ పవ‌ర్ అమాంతం పెరుగుతుంది. ఈ పండ్ల‌లో ఫైబ‌ర్ కూడా ఎక్కువే. అందుకే కాస్త ఎక్కువ తిన్నా ఇట్టే అరిగిపోతుంది.
  • ఇందులో అధిక పొటాషియం ఉన్నందున‌ బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.
  • లిచి పండ్లు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతిమంతంగా అవుతుంది. చ‌ర్మం అందంగా మార‌డానికి కావాల్సిన విట‌మిన్ కొలాజెన్. అది లిచి పండ్ల‌లో స‌మృద్ధిగా ఉంటుంది.
  • లిచి పండ్ల‌లో (litchi) షుగ‌ర్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి డ‌యాబెటిక్ పేషెంట్స్ వైద్యుల‌ను సంప్ర‌దించి తిన‌డం బెట‌ర్.