Etela Rajender: బండి సంజ‌య్‌పై మాస్ట‌ర్ ప్లాన్?!

Hyderabad: BJP తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌పై (bandi sanjay).. ఈటెల రాజేంద‌ర్ (etela rajender) పావులు క‌దుపుతున్నారా? చూడ‌బోతే అదే నిజం అనిపిస్తోంది. కొంత‌కాలంగా బీజేపీలో ఉన్న తెలంగాణ నేత‌ల్లో అంత‌ర్గ‌త విభేదాలు ఉన్నాయి. ఈటెల రాజేంద‌ర్, బండి సంజ‌య్‌కి మ‌ధ్య విభేదాలున్న‌ట్లు క్లియ‌ర్‌గా తెలుస్తోంది. అదీకాకుండా బండి సంజ‌య్ కొన్నిసార్లు సొంతంగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఆ పార్టీలోని తెలంగాణ నేత‌ల‌కు అస్స‌లు నచ్చ‌డంలేదు. దాంతో తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఈటెల రాజేంద‌ర్ ఉంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారు. ఈ విష‌యంపై త్వ‌ర‌లో కేంద్ర‌మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డాల‌తో కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అదీకాకుండా బండి సంజ‌య్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తరువాత ఆధిపత్యం పెరిగి తమను కలుపుకుపోవట్లేదని కరీంనగర్ బీజేపీ సీనియర్ నాయకులు పొలసాని సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణ రెడ్డి అలిగిన‌ట్లున్నారు. దాంతో వారు ఈటెల రాజేంద‌ర్‌ను క‌లిసి చ‌ర్చించుకున్నారు. దాంతో వారిపై బండి సంజ‌య్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈటెల గూఢ‌చర్యం చేస్తున్న‌ట్లు బండి సంజ‌య్‌కి అర్థ‌మైంద‌ని, అందుకే ఆయ‌న్ను దూరం పెడుతున్నార‌ని ప‌లువురి వాదన‌.