Sumalatha కొడుకు పెళ్లిలో మంచు మనోజ్ దంపతుల సందడి!
Bengaluru: మంచు మనోజ్ (manchu manoj) దంపతులు అలనాటి నటి సుమలత (sumalatha) కుమారుడి పెళ్లిలో సందడి చేసారు. సుమలత కుమారుడు, సినీ నటుడు అభిషేక్.. మోడల్ అయిన అవీవా బోడప్పల వివాహం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. వేడుకకు ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేడుకకు మనోజ్.. తన భార్య భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ నవదంపతులకు కంగ్రాట్స్ చెప్పారు.