Odisha Train Accident: CBI విచారణ వద్దంటున్న నేతలు..ఎందుకు?
Odisha: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై (odisha train accident) అనుమానాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఈ కేసును CBIకి అప్పగించింది. క్షణం ఆలస్యం చేయకుండా CBI ప్రమాదం చోటుచేసుకున్న బెలసోర్ జిల్లాకు వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించింది. అయితే CBIకి కేసును ఇవ్వాల్సిన అవసరం ఏముందని పలువురు నేతలు ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee), కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే (mallikarjun kharge) తో సహా పలువురు నేతలు సీబీఐ ఉన్నది నేరాలకు సంబంధించిన కేసులను పరిశీలించడానికి అంటున్నారు. రైలు ప్రమాదానికి CBIకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి బాధ్యులు తామే అని ఒప్పుకోకుండా సీబీఐకి కేసు అప్పగించి ప్రజల మన్ననలు పొందాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (ashwini vaishnaw) అనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సీబీఐ విచారణ ఎందుకు అని ప్రశ్నిస్తున్న మమతా బెనర్జీ, మల్లిఖార్జున ఖర్గేలు గతంలో రైల్వే శాఖ మంత్రులుగా పనిచేయడం గమనార్హం. 12 ఏళ్ల క్రితం జ్నానేశ్వరి రైలు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని సీబీఐకి కేసును అప్పగించానని, వారు ఏమీ చేయలేకపోయారని మమతా అన్నారు.