Telangana Elections: BJPని పక్కకు పెట్టిన KCR?!
Hyderabad: తెలంగాణ ఎన్నికలు (telangana elections) సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ BRS గురి BJPపై ఉంటుందనే అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) ఫోకస్ అంతా కాంగ్రెస్‌పైనే (congress) ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. మొన్న ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించిన KCR మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో (telangana elections) తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో ముంచాలి అని కామెంట్స్ చేసారు. దాదాపు అరగంట పాటు మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఒక్కసారి కూడా ఆయన నోటి నుంచి BJP మాట రాలేదు. మామూలుగా కేసీఆర్ ఏ మీడియా సమావేశం పెట్టినా బీజేపీని ఒక్క మాట అనందే ఆ ప్రసంగం ఆగదు. అలాంటిది ఈ మధ్యకాలంలో ఆయన బీజేపీని పక్కనపెట్టి ఎక్కువగా కాంగ్రెస్ గురించే మాట్లాడుతున్నారు. దాంతో BRS కేడర్‌లోనూ కన్ఫ్యూజన్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను విసిరిపారేస్తాం అని కామెంట్స్ చేసారు. కానీ కేసీఆర్ మాత్రం కేవలం కాంగ్రెస్ నేతలు అన్న మాటలనే పట్టించుకున్నారు తప్ప బీజేపీ నేతలను ఒక్క మాట కూడా అనలేదు. దాంతో ఏం జరిగి ఉంటుందని అటు బీజేపీ నేతలు కూడా ఆలోచనలో పడ్డారు. అసలు కేసీఆర్ తన పార్టీని TRS నుంచి BRS అని మార్చింది BJPకి వ్యతిరేకంగా పోరాడటానికే. బీజేపీ జాతీయ పార్టీ కావడంతో తమ తెలంగాణ పార్టీని కూడా జాతీయ పార్టీగా మారుస్తానని కేసీఆర్ నడుం బిగించారు. అలాంటిది ఉన్నట్టుండి ఇప్పుడు అసలు బీజేపీని కేసీఆర్ ఎందుకు పక్కకుపెట్టారో అర్థంకావడంలేదు.