Wrestlers Protest: ఎట్ట‌కేల‌కు స్పందించారు

Delhi: నెల రోజుల నుంచి ఆందోళ‌న చేప‌డుతున్న భార‌త రెజ్ల‌ర్ల‌కు (wrestlers protest) కాస్త ఊర‌ట క‌లిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) ఆదివారం రాత్రి రెజ్ల‌ర్ల‌ను క‌లిసి వారితో మాట్లాడారు. చ‌ట్టం త‌న ప‌ని త‌ను చేసుకుపోతుంద‌ని, కాస్త ఓర్పు వ‌హించాలని అన్నారు. భ‌జ‌రంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్‌లు అమిత్ షాని క‌లిసారు. అయితే ఏం చ‌ర్చించారు అన్న విష‌యాలు మాత్రం వారు మీడియాకు వెల్ల‌డించ‌లేదు.

చ‌ట్టం ఎవ్వ‌రికైనా ఒక్క‌టేన‌ని అమిత్ షా వారితో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం రెజ్లర్ల బాధ‌ను ప‌ట్టించుకోలేదు. పైగా వారి ఆందోళ‌న వెన‌క వేరే కుట్ర ఉందంటూ కించ‌ప‌రిచారు. ఈ నేప‌థ్యంలో అమిత్ షా వారిని క‌లిసి మాట్లాడ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రెజ్ల‌ర్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (wfo) చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ (brij bhushan sharan singh) త‌మ‌ను లైంగికంగా వేధించారంటూ రెజ్ల‌ర్లు నెల రోజులుగా ఆందోళ‌న చేప‌డుతున్నారు. దిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ (jantar mantar) వ‌ద్ద బైఠాయించి ఆందోళన చేప‌ట్టారు. నెల రోజులు కావొస్తున్న కేంద్రం (bjp) దిగి రాక‌పోవ‌డం.. పైగా పోలీసులు త‌మ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో రెజ్ల‌ర్లు తమ మెడ‌ల్స్‌ను హ‌రిద్వార్‌లోని గంగా న‌దిలో విసిరేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మొత్తానికి అమిత్ షానే (amit shah)  వారితో మాట్లాడారు కాబ‌ట్టి ఇక వారు కాస్త ప్ర‌శాంతంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.