Siddharth: మోసం చేసే అమ్మాయిలు న‌చ్చ‌రు

Hyderabad: ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బాయ్‌గా ఎంద‌రో అమ్మాయిల మ‌న‌సులు దోచుకున్న సిద్ధార్థ్ (siddharth) ఇప్పుడు ట‌క్కర్ (takkar) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. కార్తిక్ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. దివ్యాంశ కౌశిక్ (divyansha kaushik) ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించారు. జూన్ 9న సినిమా రిలీజ్ అవ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా సిద్ధార్థ్ (siddharth) ఓ ఇంట‌ర్వ్యూలో సినిమా గురించి త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకున్నారు.

“ఈ సినిమాలో న‌న్ను నాకే కొత్త‌గా చూపించినందుకు డైరెక్ట‌ర్ కార్తిక్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఇది ఓటీటీలో చూసే సినిమా కాదు. క‌చ్చితంగా థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాకు ఇలా చెప్ప‌లేదు. ట‌క్క‌ర్ మూవీ చూసాక యాక్ష‌న్ సీన్ల‌కు సిద్ధార్థ్ ఏం ప‌నికొస్తాడు అన్న‌వారంతా నాకోసం ఇంకా యాక్ష‌న్ డోస్ పెంచేలా ఉంటుంది. ఇక సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయ‌ని అంటున్నారు. ప్ర‌పంచంలోనే మ‌న దేశం అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన‌ది. ఏ రొమాన్స్ లేకుండా ఎలా సాధ్య‌మైంది? సినిమాలో ఏకే 47తో 100 మందిని కాల్చి చంపేస్తే ఏమీ అన‌రు కానీ ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకుంటే హ‌వ్వ అంటారు. అదేంటో నాకు అర్థంకాదు”

“ఇక నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికొస్తే చాలా మ్యాట‌ర్స్ నేను ఫ్యాన్స్‌కి చెప్పుకోలేను. వాళ్ల‌కు నా గురించి అన్నీ తెలిసిపోతే న‌న్ను సినిమాల్లో చూసి ఎంజాయ్ చేయ‌లేరు. ఇక నేను డేటింగ్, ల‌వ్ కంటే పెళ్లికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకు పాజిటివ్‌గా మాట్లాడే అమ్మాయి ముఖ్యంగా చీట్ చేయ‌ని అమ్మాయిలంటేనే ఇష్టం” అని వెల్ల‌డించారు సిద్ధూ.