Prashanth Neel బర్త్‌డే పార్టీలో ప్రభాస్
Hyderabad: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (prashanth neel) బర్త్‌డే పార్టీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (prabhas) సందడి చేసారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సలార్ (salaar) మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. శనివారం ప్రశాంత్ నీల్ బర్త్‌డే కావడంతో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటుచేసారు. ఈ పార్టీకి ప్రభాస్ బ్లాక్ అంబ్ బ్లాక్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ వేడుకను మరింత స్పెషల్‌గా మార్చారు. పార్టీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సలార్ మూవీలో శ్రుతి హాసన్ (shruti haasan) హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్క ఫస్ట్‌లుక్ కానీ గ్లింప్స్ కానీ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ టీంపై కామెంట్లు పెడుతున్నారు. ప్రశాంత్ నీల్, ప్రొడ్యూసర్ విజయ్ కిర్గండూర్‌లను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. వారి టార్చర్ భరించలేక వీరిద్దరూ ట్విటర్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దాంతో అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.