Abbas: సినిమాల్లేక అమెరికాలో బాత్రూమ్‌లు క‌డిగా

Hyderabad: అబ్బాస్ (abbas) అంటే తెలీని తెలుగువారు ఉండ‌ర‌నే చెప్పాలి. 1990ల్లో అబ్బాస్ (abbas) అంటే సౌత్ ఇండియాలోనే సెన్సేష‌న‌ల్ యాక్ట‌ర్. రాజా, న‌ర‌సింహ, ప్రియురాలు పిలిచింది, ప్రేమ దేశం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించిన అబ్బాస్‌.. కొన్నేళ్ల‌లోనే సినిమాలు వ‌దిలేసి ఫ్యామిలీతో అమెరికా వెళ్లిపోయారు. అలా వెళ్లిపోవ‌డానికి కార‌ణ‌మేంటో ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

“వ‌రుస‌గా సినిమాల‌తో బిజీగా ఉన్న నాకు హిందీ సినిమాల్లోనూ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అప్ప‌టికే నేను అన్ష్ అనే సినిమాలో న‌టించాను. ఆ సినిమా రిలీజ్ అయ్యేలోపు రెండు సినిమాల‌కు ఓకే చేసాను. అవి షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో అన్ష్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. దాంతో నేను చేస్తున్న రెండు సినిమాలు ఆగిపోయాయి. ఆ త‌ర్వాత అస‌లు ఆఫ‌ర్లు రాలేదు. ఇక చేసేదేమీ లేక ఫ్యామిలీతో అమెరికా వెళ్లిపోయాను. అక్కడ ఒక స‌రైన ఉద్యోగం దొర‌క్క పెట్రోల్ బంకుల్లో ప‌నిచేసాను. బాత్రూమ్స్ క‌డుగుతూ మెకానిక్‌గా ప‌నిచేసిన రోజులూ ఉన్నాయి. ఆ త‌ర్వాత కాల్ సెంట‌ర్ల‌లో ప‌నిచేసి మొత్తానికి ఇప్పుడు క్వాలిటీ ఎన‌లిస్ట్‌గా ప‌నిచేస్తున్నాను” అని తెలిపారు.

మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం అబ్బాస్ (abbas) కొలీగ్ ఒకరు ఆయ‌న న‌టించిన ప్రేమ దేశం సినిమా చూసాడ‌ట. అందులో ఉన్న‌ది అబ్బాసే అని తెలీక ఆ పోస్ట‌ర్‌ను అబ్బాస్‌కి పంపించి ఇత‌ను అచ్చం నీలాగే ఉన్నాడు అన్నాడ‌ట‌. అది విని న‌వ్వుకున్నాన‌ని అబ్బాస్ తెలిపారు.