అసలు ఎలా జరిగింది? 3 నిమిషాల్లోనే అంతా అయిపోయింది
Odisha: ఒడిశాలోని (odisha) బెలసూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్న (train accident) ఘటనలో 250 మందికి పైగా మృత్యువాతపడ్డారు. అసలు ఈ రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే.. కోరమాండల్ శాలిమార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి.. పక్క పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది. అప్పటివరకు చాలా తక్కువ మందికి గాయాలయ్యాయి. ఇక్కడితో ప్రమాదం ఆగిపోయి ఉంటే దీనిని ఓ చిన్న యాక్సిడెంట్లా భావించి మర్చిపోయేవారు. కానీ నిమిషాల్లోనే యశ్వంత్పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అప్పటికే శరవేగంపై ఉండడంతో కంట్రోల్ తప్పి ఆల్రెడీ పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొని ఉన్న కోరమాండల్ శాలిమార్ ఎక్స్ప్రెస్ను ఢీకొంది. అలా మూడు నిమిషాల్లోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రైలు బోగీల మధ్యలో ఇరుక్కుపోయిన శవాలను వెలికితీసే పనిలో రైల్వే అధికారులు ఉన్నారు. దగ్గర్లోని హాస్పిటల్స్లో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు వచ్చి పడుతున్నాయి. చాలా మంది నిద్రలో ఉండగానే ప్రాణాలు కోల్పోయారు.