Hair Fall: ఇవి తింటే జుట్టు రాలడం ఖాయం!
Hyderabad: కొన్ని ఆహార పదార్థాల (foods) వల్ల హెయిర్ ఫాల్ (hair fall) సమస్యలు వస్తుంటాయి. వాటికి దూరంగా ఉంటే బెటర్. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
చెక్కర (sugar)
చెక్కర ఎక్కువ తింటే జుట్టుకే కాదు మొత్తం శరీరానికే ప్రమాదం. ఒకవేళ చెక్కర వాడాలనుకుంటే దాని బదులు బెల్లం పొడి వాడుకోవడం మంచిది. చెక్కర ఎక్కువ తినేవారిలో బట్టతల త్వరగా వచ్చేస్తుంది.
ఆల్కహాల్ (alcohol)
జుట్టులో ఉండే ప్రొటీన్‌ను ఆల్కహాల్ పీల్చేస్తుంది. దాంతో కుదుళ్ల దగ్గర జుట్టు పల్చబడిపోతుంది.
డైట్ సోడాలు (diet sodas)
డైట్ సోడాలు, సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉండేవి ప్రమాదకరమైన ఆస్పార్టేమ్ అనే స్వీట్నర్లు. జుట్టు కుదుళ్లను ఇవి పాడుచేసి నిర్జీవంగా మారేలా చేస్తాయి.
జంక్ ఫుడ్ (Junk food)
ఇందులో ఉండే ఫ్యాట్ ఊబకాయానికి దారితీస్తుంది. ఫలితంగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇది జుట్టుని పెరగనివ్వకుండా ఆపుతుంది.
పచ్చి కోడిగుడ్లు (Raw Egg whites)
పచ్చి కోడిగుడ్లను తాగేస్తే శరీరంలో బయోటిన్ లోపం ఏర్పడుతుంది. జుట్టు పెరుగుదలకి కావాల్సిన అసలైన ప్రొటీన్ కెరాటిన్. బయోటిన్ తగ్గితే ఆటోమేటిక్‌గా కెరాటిన్ కూడా తగ్గిపోతుంది.
చేపలు (Fish)
చేపలు ఎక్కువగా తినేవారిలో మెర్క్యూరీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయట. ఆ లెవల్స్ ఎక్కువగా ఉంటే హెయిర్ లాస్ అవుతుంది అంటున్నారు నిపుణులు.
ఇవి కాకుండా ఎక్కువగా సప్లిమెంట్లు (supplements), క్యారెట్లు (carrots), నట్స్ (nuts) విపరీతంగా తీసుకుంటే పోషకాలు ఎక్కువై కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది.