Varun Tej: వరుణ్, లావణ్యల నిశ్చితార్ధం ఈ నెలలోనా?!
Hyderabad: వరుణ్ తేజ్ (varun tej) , లావణ్య త్రిపాఠి (lavanya tripathi) లు ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ జంటగా మిస్టర్ సినిమాలో నటించారు. అప్పటినుంచి ప్రేమలో ఉన్నట్లు టాక్. అయితే వీరి నిశ్చితార్ధం (engagement) ఈ నెలలోనే జరగనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ నెల 9న గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేయనున్నారని ఫ్రెండ్స్, ఫ్యామిలీలను మాత్రమే ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.. వరుణ్ (varun tej) ప్రస్తుతం ఫ్రాన్స్‌తో ఉన్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా వెల్లడించాడు. మరోపక్క లావణ్య (lavanya tripathi) కూడా ఇండియాలో లేనట్లే తెలుస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ని బట్టి చూస్తే తను కూడా ఫ్రాన్స్‌లో ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే.. వరుణ్, లావణ్య కలిసే ఫ్రాన్స్ టిప్ వేసి ఉంటారని నెటిజన్లు కూడా గుసగులాడేసుకుంటున్నారు.
చాలా రోజులుగా వీరిద్దరి ప్రేమ, పెళ్లి గురించి వార్తలు వస్తున్నప్పటికీ అందులో ఎటువంటి నిజం లేదని అటు లావణ్య కానీ ఇటు వరుణ్ కానీ స్పందించింది లేదు. దాంతో వారి పెళ్లి పుకార్లు నిజమేనేమో అందుకే పెదవి విప్పడంలేదేమో అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లి జోధ్‌పూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక అందరికంటే ముందు లావణ్యకు ఆహ్వానం అందిందట. చూడబోతే.. లావణ్య మెగా కోడలు కాబోతోందనే మాట త్వరలోనే నిజం అయ్యేలా ఉంది.