Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌పై పాకిస్థానీ క్రికెటర్ కామెంట్స్
Hyderabad: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై (rohit sharma) పాకిస్థానీ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ (salman butt) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ IPL సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) ఐదోసారి టైటిల్ గెలిచి ముంబై ఇండియన్స్‌కు సమానంగా నిలిచింది. అయితే ఇక్కడి IPL గురించి పాకిస్థాన్‌లో చర్చ జరిగింది. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (ms dhoni), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మల (rohit sharma) మధ్య ఉన్న కంపారిజన్ ఏంటి అని సల్మాన్ బట్‌ను ప్రశ్నించగా.. ఆయన రోహిత్ శర్మపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి.
సల్మాన్ బట్ ధోనీ గురించి ఏమీ మాట్లాడలేదు కానీ ఫిట్‌నెస్ విషయంలో రోహిత్ శర్మ కేర్‌లెస్‌గా ఉంటాడని అన్నాడు. టీం ఫిట్‌గా ఉండాలని చెప్తుండే రోహిత్ శర్మ ముందు తన ఫిట్‌నెస్ ఎలా ఉందో చూసుకోవాలని మండిపడ్డాడు. “రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ అయినప్పుడు అదే రేంజ్‌లో ఫిట్‌నెస్ కూడా మెయింటైన్ చేయాలి. మొత్తం టీమిండియాను ముందు నడిపించే సత్తా ఉండాలి. మనం ఏదన్నా డిమాండ్ చేసే ముందు అది మనలో ఉందో లేదో చూసుకోవాలి. రోహిత్ ఫిట్‌గా మారితే అతని బ్యాటింగ్ స్కిల్స్ మరింత బాగుంటాయి. దీని గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కానీ రోహిత్ ఎందుకు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడంలేదో అర్థంకావడం లేదు” అని తెలిపారు సల్మాన్ బట్.