Video Games ఆడితే రూ.10 ల‌క్ష‌లు..!

Hyderabad: ఆహా.. విన‌డానికే ఎంతో హాయిగా ఉంది క‌దా..! జ‌స్ట్ వీడియో గేమ్స్ (video games) ఆడితే ఓ కంపెనీ రూ.10 ల‌క్ష‌లు ఇస్తామంటోంది. ఇంత‌కీ అది ఏ కంపెనీ అంటే.. iQOO. ఈ క‌న్‌స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ సంస్థ చీఫ్ గేమింగ్ ఆఫీస‌ర్ కోసం చూస్తోంది. 6 నెల‌ల కాంట్రాక్ట్‌కి రూ.10 ల‌క్ష‌లు ఇస్తామంటోంది. కాక‌పోతే వీడియో గేమ్స్‌పై మంచి ప‌ట్టు ఉండి 25 ఏళ్ల లోపు వ‌య‌సున్న వారికే ఈ అవ‌కాశం.ఎంపికైన‌వారు iQOO అధికారుల‌తో క‌లిసి ప‌నిచేయాల్సి ఉంటుంది. త‌మకున్న గేమింగ్ నాలెడ్జ్ అంతా ఉప‌యోగించి iQOOకి డాక్య‌మెంటేష‌న్ ఇస్తుండాలి. దీని ద్వారా iQOO లాంచ్ చేసిన ఫోన్ల‌లో మెరుగైన వీడియో గేమ్ ఫీచ‌ర్ల‌ను త‌యారుచేస్తారు.

2022లో ఇండియ‌న్ గేమింగ్ ఇండ‌స్ట్రీ ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. గ్లోబల్ గేమ్ డౌన్‌లోడర్ల‌లో 17% మంది GenZ గేమ‌ర్లే ఉన్నారు. 2 బిలియ‌న్ మంత్లీ యాక్టివ్ యూజ‌ర్లు ఉన్నారు. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాల‌నుకునేవారు iQOO అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట‌ర్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా రిజిస్ట‌ర్ చేసుకునే ఛాన్స్ ఉంది. అప్లై చేసుకోవాల‌నుకునేవారు కచ్చితంగా ఇండియ‌న్ అయివుండాలి. వారి వ‌య‌సు 18 నుంచి 25 మ‌ధ్య‌లో ఉండాలి. ఇంకా వీడియో గేమ్స్ గురించి 360 డిగ్రీ నాలెడ్జ్ ఉండి తీరాలి.