గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఉందా? KCR ప్లాన్‌ ఏంటి?

Hyderabad: తెలంగాణలో గ‌వ‌ర్నర్ కోటా ఎమ్మెల్సీల‌ భర్తీ విషయం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. అసలు kcr ఎమ్మెల్సీలను ఎప్పుడు భర్తీ చేస్తారు అన్నదానిపై ఎవరికి క్లారిటీ లేదు. ఆయన మౌనం వెనుక కారణం ఏంటో తెలియక ఆశావహులు సతమతం అవుతున్నారు. గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీలకు అవకాశ ఉండగా.. దీనికోసం అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే.. గత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్‌ తమిళసై, సీఎం kcr మధ్య గ్యాప్‌ నడుకస్తోంది. TS నూతన సచివాలయం ప్రారంభానికి, BR అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణకు KCR తనను ఆహ్వానించలేదని నేరుగా గవర్నర్‌ చెప్పడం సంచలనం అయ్యింది. అంతేకాకుండా.. కేసీఆర్‌ సర్కార్‌ కొన్ని బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపగా వాటిని ఆమె ఆమోదించకుండా వెనక్కు పంపింది. దీంతో వారి మధ్య వివదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కోటా స్థానాల అభ్యర్థులను ప్రపోజ్‌ చేస్తూ.. గ‌వ‌ర్న‌ర్‌కు పంపితే. ఆమె ఆమోదిస్తుందో  లేదో తెలీదు. అందుకే కేసీఆర్‌ ఈ అంశంపై మౌనం వహిస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

గతంలో ఎమ్మెల్సీలుగా రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌లు ఉన్నారు. వీరి ప‌ద‌వీకాలం గత శ‌నివారంతో ముగిసింది. గతంలో ఎమ్మెల్సీగా కౌషిక్‌రెడ్డి పేరు ప్రతిపాదించినా..గవర్నర్‌ ఆ పేరును తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి గవర్నర్‌ మధ్య వార్‌ కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మధుసూదనాచారి, గోరేటి వెంకన్న పేర్లను పంపగా.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా నేతల పేర్లను ఖరారు చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సారి ఎమ్మెల్సీలుగా కొత్త వారికి అవకాశం ఇచ్చే చాన్స్‌ ఉంది. ఇందులో ఒకటి మైనార్టీ, మరొకటి బీసీ నేతలకు ఇస్తారని అంటున్నారు.