Jadeja: భ‌ర్త కాలు మొక్కి.. ఆలింగ‌నం చేసుకున్న రివాబా

Hyderabad: క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా (ravindra jadeja) భార్య రివాబా జ‌డేజా (rivaba jadeja) వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నిన్న జ‌రిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ మ్యాచ్‌లో csk గెలిచిన సంగ‌తి తెలిసిందే. చివ‌రి రెండు బాల్స్‌లో 6, 4 కొట్టి టీంకు టైటిల్ వ‌చ్చేలా చేసాడు జడేజా. గెలిచిన ఆనందంలో అంద‌రూ సంబ‌రాల్లో మునిగితేలారు. ఆ స‌మ‌యంలో జడేజా భార్య రివాబా చీర క‌ట్టుకుని సంప్ర‌దాయంగా మ్యాచ్‌ను వీక్షించ‌డానికి వ‌చ్చారు. అంతేకాదు.. త‌న భ‌ర్త ద‌గ్గ‌రికి వెళ్లి కాళ్లు మొక్కి ఆలింగ‌నం చేసుకున్నారు. ఇది క‌దా మ‌న భార‌తీయ సంప్ర‌దాయం అంటూ నెటిజ‌న్లు రివాబా, ర‌వీంద్ర జడేజా దంప‌తుల‌ను చూసి మురిసిపోతున్నారు.