Ram Charan తన కాల్ ఆన్సర్ చేయడంటున్న డైరెక్టర్!
Mumbai: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పదేళ్ల కిందటే బాలీవుడ్(Bollywood) ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా(Director Apoorva Lakhia) దర్శకత్వంలో జంజీర్(Zanjeer) అనే సినిమా ద్వారా 2013 లోనే నార్త్ ప్రేక్షకులను పలకరించాడు చెర్రీ. తెలుగులో తుపాన్(Toofan) టైటిల్‌తో రిలీజైన ఈ సినిమాలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా(Priyanka chopra) నటించింది. కాగా, చరణ్ పోలీస్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతేకాదు, ఈ సినిమాలో చెర్రీ నటనపై నార్త్ మీడియా చాలా దారుణంగా విమర్శలు చేసింది.
అయితే ఆర్ఆర్ఆర్తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు రామ్ చరణ్. అప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు చెర్రీని తెగ పొగిడేస్తున్నారు. బాలీవుడ్లో చెర్రీతో సినిమాలు తీసేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. హాలీవుడ్ నుంచి కూడా చరణ్‌కి అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా తుపాకీ దర్శకుడు అపూర్వ లఖియా చెర్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రామ్ చరణ్ నాకు మంచి స్నేహితుడు. జంజీర్ బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోకపోయినా తను నాకు మంచి స్నేహితుడిగానే ఉన్నాడు. చాలాసార్లు హైదరాబాద్ లోని తన ఇంటికి వెళ్లి చాలాసార్లు అతనితో కలిసి ఉన్నాను. కానీ కొంతకాలంగా చరణ్ నా కాల్ ఆన్సర్ చేయడం లేదు. బహుశా తన ఫోన్ మారిపోయి ఉంటుంది. అతని భార్య ఉపాసన మాత్రం రెస్పాండ్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు లిఖియా.