Aadhaar PAN లింక్ చేసుకున్నారా?

Hyderabad: మీ ఆధార్ కార్డుని ప్యాన్ కార్డుతో (aadhaar pan) లింక్ చేసుకున్నారా? జూన్ 30 వ‌ర‌కే డెడ్‌లైన్. ఇంకా చేసుకోక‌పోతే వెంట‌నే చేసుకోవాల‌ని కేంద్రం హెచ్చ‌రిస్తోంది. అస‌లైతే మార్చి 31వ‌ర‌కే కేంద్ర ప్ర‌భుత్వం డెడ్‌లైన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ డెడ్‌లైన్‌ని కాస్తా జూన్ 30 వ‌ర‌కు మార్చింది. స‌రిగ్గా నెల రోజులు మాత్ర‌మే ఉంది. అప్ప‌టికీ లింక్ చేసుకోక‌పోతే ప్యాన్ కార్డులు ఇక ప‌నికిరావ‌ని CBDT (సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) హెచ్చ‌రిస్తోంది. 114AAA రూల్ ప్ర‌కారం.. ప్యాన్ కార్డుని ఆధార్‌తో లింక్ చేయ‌క‌పోతే అది ఇక ప‌నికిరాద‌ని, ముందు ముందు ప్యాన్ కార్డుని దేనికీ ఉప‌యోగించ‌లేరని CBDT తెలిపింది. మార్చి 31 ముందు వ‌ర‌కు ఆధార్ ప్యాన్ లింకింగ్ (aadhaar pan linking) ఫ్రీగానే చేసుకున్నారు. ఆ త‌ర్వాత నుంచి రూ.1000 చెల్లించాల్సి వ‌స్తోంది. ఆన్‌లైన్ ద్వారా ప్యాన్, ఆధార్ లింక్ చేసుకోవాలి అనుకునేవారు https://incometaxindiaefiling.gov.in లోకి వెళ్లి మీ ప్యాన్, ఆధార్ నెంబ‌ర్‌తో లాగిన్ అయ్యి లింక్ చేసుకోండి. లేదంటే ద‌గ్గ‌ర్లోని మీ సేవ సెంట‌ర్ల‌కు వెళ్లినా వారు చేసి ఇస్తారు.