అంద‌గ‌త్తెల పోటీలో భార్య‌కు రెండో స్థానం..ర‌చ్చ చేసిన భ‌ర్త‌!

Brazil: అంద‌గ‌త్తెల పోటీలో (beauty contest) భార్య‌కు మొద‌టి స్థానం ఇవ్వ‌లేద‌ని కిరీటాన్ని విర‌గ్గొట్టి హంగామా చేసాడు ఓ భ‌ర్త‌. బ్రెజిల్‌లో (brazil) జ‌రిగిన బ్యూటీ కాంటెస్ట్‌లో (beauty contest) ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. శ‌నివారం బ్రెజిల్‌లో మిస్ గే మాటో గ్రోసో 2023 బ్యూటీ కాంటెస్ట్ జ‌రిగింది. ఇది LGBTQ వ‌ర్గానికి చెందిన బ్యూటీ కాంటెస్ట్. ఈ వేడుక‌లో న‌థాలీ, బెలిని ఫైన‌లిస్ట్‌లుగా ఉన్నారు. వీరిలో విన్న‌ర్‌గా బెలినీని ప్ర‌క‌టించారు. న‌థాలీ ర‌న్న‌రప్‌గా నిలిచింది. దాంతో త‌న భార్యను విన్న‌ర్‌గా ప్ర‌క‌టించ‌లేద‌ని స్టేజ్ ఎక్కి మ‌రీ బెలినీ త‌ల‌పై ఉన్న కిరీటాన్ని తీసి నేల‌కేసి కొట్టాడు న‌థాలీ భ‌ర్త. దాంతో అక్క‌డున్న‌వారంతా షాక‌య్యారు. ఆ కిరీటాన్ని ముక్క‌లు ముక్కుల‌గా విర‌గ్గొట్టాడు. కాసేప‌టి త‌ర్వాత బాడీగార్డ్స్ అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఎవ‌రికి సామ‌ర్ధ్యం ఉందో వారినే విన్న‌ర్‌గా ప్ర‌క‌టిస్తామ‌ని, ఇలా చేయ‌డం స‌బ‌బు కాద‌ని ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు మండిప‌డ్డారు. న‌థాలీ భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.