Wrestlers Protest: మెడ‌ల్స్ గంగ‌లో విస‌ర‌నున్న రెజ్ల‌ర్లు

Delhi: WFI చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌ (brij bhushan singh) లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడంటూ దాదాపు నెల‌రోజుల నుంచి భార‌త రెజ్ల‌ర్లు (wrestlers protest) ఆందోళ‌న చేస్తున్నారు. దిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ (jantar mantar) వ‌ద్ద ఆందోళ‌న చేస్తూ అక్క‌డే తింటూ ప‌డుకుంటున్నారు. నెల‌రోజుల‌కు పైగా కావొస్తున్నా ఇంకా కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య తీసుకోవ‌డంలేదు. అదీకాకుండా ఆదివారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (modi) పార్ల‌మెంట్‌ను ప్రారంభించిన నేపథ్యంలో త‌మ బాధ‌ను నేరుగా ప్ర‌ధానికే వివ‌రించాల‌ని పార్ల‌మెంట్ (parliament) వైపు మార్చ్ పాస్ట్ చేయాల‌నుకున్న రెజ్లర్ల ప‌ట్ల దిల్లీ పోలీసులు దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. వారిపై చేయి చేసుకున్నారు.

ఇంత జ‌రిగినా కేంద్ర నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఇండియా గేట్ (india gate) వ‌ద్ద నిరాహార దీక్ష చేపట్ట‌నున్న‌ట్లు తెలిపారు. అంతేకాదు.. ఇప్ప‌టివ‌ర‌కు సాధించ‌ని మెడ‌ల్స్ అన్నీ హ‌రిద్వార్‌లోని (haridwar) గంగాన‌దిలో విస‌ర‌నున్న‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో హ‌రిద్వార్ పోలీసులు స్పందించారు. త‌మ‌కు పై అధికారుల నుంచి ఎలాంటి స‌మాచారం అంద‌క‌పోవ‌డంతో రెజ్లర్ల‌ను ఆపే హ‌క్కు త‌మ‌కు లేద‌ని తెలిపారు. వాళ్లు మెడ‌ల్స్ గంగ‌లో విసిరినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని అంటున్నారు. బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌పై ఫిర్యాదు న‌మోదైన‌ప్పుడు ఇంకా ఎందుకు ఆందోళ‌న చేప‌డుతున్నారంటూ దిల్లీ పోలీసులు వారిని త‌రిమికొట్టారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తే ఇక ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఈ ఆందోళ‌న ఎంత‌వ‌ర‌కు వెళ్తుందో వేచి చూడాలి.